News

కడియం శ్రీహరికి సీఎం శుభాకాంక్షలు


తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఆయన జీవించాలని వారు ఆకాంక్షించారు. శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.